PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలూ పాలు.. అద‌ర‌హో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్‌ కంపెనీ అయిన ‘డగ్‌’ ఈ పాలను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాఫీ తరహాలో ఉండే లాట్టెస్, కాపిచీనో తయారు చేసుకొనేందుకు ఈ పాలు ఎంతో బాగుంటాయని తెలిపింది. త్వరలోనే ఇతర యూరోపియన్‌ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వివరించింది. ముఖ్యంగా ఇది వెగాన్‌ ఫ్రెండ్లీ కావడంతో శాకాహారులంతా ఈ ఆలూ పాలు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అలాగే జంతువుల నుంచి సేకరించే పాలలో ఉండే లాక్టోస్‌ కొందరికి జీర్ణం కాదు. ‘డగ్‌’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్‌రహితమైనవి కావడం వల్ల కూడా చాలా మంది ఈ పాలు తాగుతున్నారట.

                                       

About Author