NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌స‌వ‌త్తరంగా ‘మా’ ఎన్నిక‌లు.. త్రిముఖ పోటీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారాయి. మా ఎన్నిక‌ల్లో అధ్యక్ష స్థానం కోసం త్రిముఖ పోటీ నెల‌కొంది. అనూహ్యంగా మంచు విష్ణు బ‌రిలోకి దిగారు. ఇటీవ‌ల త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి… సూప‌ర్ స్టార్ కృష్ణను క‌లిశారు. కృష్ణ ఆశీస్సులు కోరారు. మ‌రోవైపు విల‌క్షణ న‌టుడు ప్రకాశ్ రాజ్ కూడ బ‌రిలోకి దిగారు. ప్రకాశ్ రాజ్ కు ఇప్పటికే మెగా బ్రద‌ర్ నాగ‌బాబు మ‌ద్దతు ప‌లికారు. దీంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. జీవితా రాజ‌శేఖ‌ర్ కూడ బ‌రిలో నిలిచేందుకు సిద్ధమ‌వుతున్నట్టు తెలుస్తోంది. జీవిత ఎంట్రీతో పోటీ త్రిముఖంగా మార‌నుంది. దీంతో స్టార్స్ మ‌ద్దతు ఎవ‌రికి ఉంది ?. మా ఎన్నిక‌ల్లో ఎవ‌రు నెగ్గుతార‌న్న ఆసక్తి నెల‌కొంది. సెప్టంబ‌ర్ లో మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

About Author