పూర్వవిద్యార్థుల.. ఔదార్యం..
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా పత్తికొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఒక పేద విద్యార్థినికి సాయం చేసి మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. చదువులో ప్రతిభను చాటి పై చదువులకు వెళ్లాలంటే ఆ పేదింటి విద్యార్థినికి పేదరికం అడ్డు తగులుతుంది. ఈ నేపథ్యంలో యువ స్పందన సొసైటీ ముందుకు వచ్చి విద్యార్థినికి సహాయ, సహకారాలు అందిస్తూ ముందుకు నడిపించింది. పత్తికొండ ఎస్సీ కాలనీ కి చెందిన లక్ష్మన్న మారుతమ్మ దంపతులు కూతురు లక్ష్మీదేవి నైపర్ జేఈఈ ఆలిండియా లెవల్లో మంచి ర్యాంకు సాధించింది. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటి సాధన కోసం కోచింగ్ తీసుకోవాల్సి ఉంది. ఇందుకు ఆర్థిక సమస్య ఎదురైంది. విద్యార్థి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు డాక్టర్ రామారావు, కళ్యాణ్ సహకారంతో 25 వేల రూపాయలు విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించారు. గతంలోనూ తమ కూతురి చదువు కోసం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు 10 వేల రూపాయలు సాయం చేసినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. యువ స్పందన సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు సురేంద్ర కుమార్ లక్ష్మన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఔదార్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.