PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్వ విద్యార్థుల సేవలు..భేష్​: డా.రమేష్​

1 min read

వైద్య శిబిరంలో 478 మందికి వైద్య సేవలు

వైద్యులను ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థు లు

పల్లెవెలుగు వెబ్​: వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సేవలు అభినందనీయమని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ రమేష్ అన్నారు ఆదివారం నాడు వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరాన్ని ఎంపీపీ లాలం రమేష్ వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జయపాల్ లు ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి విజయవాడ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుండి ఎండి గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ డాక్టర్ రమేష్ బీపీ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీదేవి గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఫిలిప్స్ నంద్యాల నుండి కీళ్లు మరియు ఎముకల నిపుణులు పాండురంగారావు పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు ఈ శిబిరంలో వివిధ వ్యాధులకు చెందిన 47 8 మంది కి వైద్య సేవల తోపాటు ఉచితంగా మెడిసిన్ అందించారు ఈ వైద్య శిబిరంలో సుమారు 50 మందికి రోగులకు టు డి ఈకో పరీక్షలు అదేవిధంగా 35 మంది కి ఎండోస్కోపిక్ పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి నంద్యాల జ్యోతి ఫార్మా యజమానులు సుబ్రహ్మణ్యం రమేష్ లు తమవంతుగా 70 వేల రూపాయల విలువచేసే మందులను ఉచితంగా అందించగా నంద్యాల కు చెందిన రెప్రజెంట్ ఫారుక్ రూ 30000 వేల విలువచేసే మందులను ఉచితంగా అందించారు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ రమేష్ సర్పంచ్ జయపాల్ మాట్లాడుతూ వెలుగోడు పూర్వ విద్యార్థుల సంఘం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం క్రీడాకారుల క్రీడల అభివృద్ధి కోసం పాఠశాల మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్నందుకు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు జిల్లా లోనే ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అన్నారు అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి విచ్చేసిన డాక్టర్ రమేష్ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ ఫిలిప్స్ డాక్టర్ పాండురంగరావు లతో పాటు మెడిసిన్ ఉచితంగా అందజేసిన జ్యోతి ఫార్మా యాజమాన్యం సుబ్రహ్మణ్యం రమేష్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంపీపీ నాలం రమేష్ సర్పంచ్ జైపాల్ ను పూలదండలు శాలువలు మెమొంటోలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల  సంఘం ప్రెసిడెంట్ జి.రామలింగారెడ్డి కార్యదర్శి మక్బూల్ భాష కోశాధికారి సుల్తాన్ మోహిద్దీన్ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ కార్యనిర్వాహక సభ్యులు జయరామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నసురుల్లా ఖాన్ జంబులయ్య శ్రీనివాసులు అతావుల్లా లక్ష్మీనారాయణ శ్రీరాములు డబ్ల్యూ చంద్రశేఖర్ రెడ్డి హారున్ నాతోపాటు పూర్వ విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

About Author