‘కూటమి’ పై ఆలూరు ఎమ్మెల్యే ఆగ్రహం..
1 min read
– పంట చేతికొచ్చే సమయానికి నీరు రాక… నష్టం
ఆలూరు, న్యూస్ నేడు: పంట చేతికొచ్చే సమయానికి సాగునీరందక దాదాపు 5వేల ఎకరాలు పంట నష్టపోయిందని, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులు నట్టేట మునిగారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం కాలువ నీరు రైతుల పొలాలకు ఏప్రిల్ మరియు మే నెల వరకు వచ్చేవి కాని ఈ కుటమి ప్రభుత్వం రైతులను నాటేట ముంచుతున్నారు. పంట చేతికి వచ్చే సమయనికి పంటకు సరిగా నీరు లేకపోవడం వల్ల హాలహర్వి, చిప్పగిరి మండలలో 4 నుంచి 5 వేల ఎకరాలు పంట నష్ట పోయిందన్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.