డ్రైనేజీ కాలువలు ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డ్రైనేజీ కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ ఉండాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో మంగళవారం ఉదయం జరుగుతున్న డ్రైనేజీ పనులను అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలం కాబట్టి డ్రైనేజీ కాలువలో చెత్తా చెదారం పేరుకు పోకుండా కాలువలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని కాలువల్లో చెత్తా చెదారం ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వస్తాయని వాటి వల్ల ప్రజలు రోగాల బారిన పడతారని గ్రామం శుభ్రంగా ఉంటే రోగాలు రావాలని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని చేస్తూ ఉండాలని పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ డీఈఈ ఘనిబాబు,పిఆర్ఏఈ ప్రతాప్ రెడ్డి,మరియు పంచాయతీ అధికారులు,సున్నంపల్లి శ్రీను, పెద్దరాజు,చిన్నరాజు పాల్గొన్నారు.