NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైంటిఫిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌ సిరీస్‌లో అమలాపాల్‌

1 min read

సినిమా డెస్క్​ : అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రలుగా ‘కుడి ఎడమైతే’ సైంటిఫిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌ సిరీస్‌ని తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ఆహా తెరకెక్కిస్తోంది. ఇది ఈ నెల16న స్ట్రీమింగ్‌ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. లూసియా, యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన మోషన్‌ పోస్టర్‌‌ సిరీస్‌పై ఇంట్రెస్ట్‌ కలిగించగా, ఇప్పుడు ప్రమోషన్‌లో భాగంగా ఆహా ఈ సిరీస్‌ టీజర్‌‌ను రిలీజ్‌ చేసింది. ‘‘మీకెప్పుడైనా లైఫ్‌లో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్లు అనిపించిందా” అన్న డైలాగ్‌తో టీజర్‌‌ స్టార్టయ్యింది. బ్యాక్‌డ్రాప్‌లో డైలాగ్స్‌ వస్తుండగానే రోడ్‌పై ఓ యాక్సిడెంట్‌. ఓ పోలీస్‌ కార్‌ స్పీడ్‌గా వచ్చి ఓ బైక్‌ని ఢీ కొట్టింది.

అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌ గాయాలతో రోడ్డుపై పడిపోతారు. డిఫరెంట్‌ రంగాలకు చెందిన ఇద్దరి జీవితాలు ప్యార్‌‌లల్‌గా చూపించారు ఇందులో. టీజర్‌‌ చూస్తుంటే ఇదో టైమ్‌ లూప్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా అర్ధమవుతోంది. ఒకరికొకరు సంబంధంలేని క్యారెక్టర్స్‌తో సాగుతున్న వాళ్ల లైఫ్‌లోకి సైంటిఫిక్‌ అంశాలు ఎలా చోటుచేసుకున్నాయో తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. ఇందులో అమలాపాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా, రాహుల్‌ విజయ్‌ డెలివరీ బోయ్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. చివరివరకూ థ్రిల్లింగ్‌గా సాగిన ఈ టీజర్‌‌ సిరీస్‌పై మరింత ఆశక్తిని కలిగిస్తోంది.

About Author