అమలాపురం అల్లర్ల కేసు.. మంత్రి విశ్వరూప్ అనుచరుల పై కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమలాపురం అల్లర్ల ఘటనలో నలుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆందోళనకారుల దాడుల్లో మంత్రి విశ్వరూప్ ఇళ్లు దగ్దమైంది. ఈ అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఏ222 వీరవెంకటసత్యప్రసాద్ వాంగ్మూలంతో కేసులు నమోదు చేశారు. ఏ 225గా సత్యరుషి, ఏ 226గా వాసంశెట్టి సుభాష్, ఏ 227గా మురళీకృష్ణ, ఏ228గా మటపర్తి రఘును పేర్కొన్నారు.