PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరజీవి  పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది

1 min read

ఆంధ్రరాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఆంధ్ర రాష్ట్ర సాధనకు అమరజీవి  పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో  ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన  పొట్టి శ్రీరాములు వంటి ఎందరో త్యాగధనులును స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో, నిబద్ధతతో ముందుకెళదామని  అన్నారు.  ఆంధ్ర రాష్ట్రఅవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు  తెలుగు వారందరికీ చిరస్మరనీయుడన్నారు. 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, తొలి బాషా ప్రయుక్త రాష్ట్రంగా  నవంబర్ 1, 1956 న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. పూర్వీకులు  మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగిస్తూ, తెలుగు ప్రముఖులును గౌరవించుకుంటూ, ఆంధ్రుల చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా మనమందరం నిలవాలని , తెలుగు జాతి ఐక్యతను పెంపొందించడానికి  ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని  ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పాలన  కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా, అర్హులందరికీ సంక్షేమ ఫలాలును అందిస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ, భగవంతుడి దీవెనలుతో, ప్రజల ఆశీస్సులుతో విజయబాటలో నడుస్తోందన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్  ముందుకు వెల్లుచుండడం హర్షణీయమని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుచున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు  ఇతర రాష్ట్రాలకు సైతం  ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం మన రాష్ట్రామన్నారు. ప్రపంచంలోనే మన  తెలుగు బాషకు ప్రత్యేక విలువ, గుర్తింపు, గౌరవం ఉందన్నారు.రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన త్యాగధనుల ఆశయ సాధనకు  ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పట్టణంలోని అల్లూరు రోడ్డు నందు ఉన్న  పొట్టి శ్రీరాములు  విగ్రహ ప్రాంతాన్ని తొందరలో  పొట్టి శ్రీరాములు సర్కిల్ గా నామకరణం చేస్తామని హమీ ఇచ్చారు.అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగ సత్యనారాయణ, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వి. ఆర్ శ్రీను, కౌన్సిలర్ వీరబొమ్మ రూపాదేవి, అబ్దుల్ హమీద్ మియ్య, నంది జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, రజిని కుమార్ రెడ్డి, చెరుకు సురేష్, నాయబ్, బి. సి నాయకులు కాళ్ళూరి శివ ప్రసాద్, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామకృష్ణ, లాలు ప్రసాద్, డి. రమేష్, బాండ్స్ శ్రీను, శాలి భాష, పి. రమేష్, వెంకటేశ్వర్లు తదీతరులు తదీతరులు పాల్గొన్నారు.

About Author