అమరనాథ్ వరదలు.. రంగంలోకి ఏపీ ప్రభుత్వం
1 min read
పల్లెవెలుగువెబ్ : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో చేస్తున్న ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అకస్మాత్తుగా అమర్నాథ్‌లో వరదలు రావడంతో వేలాది యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు.