PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్..!

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలుగు యువ‌కుడికి అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఏడాదికి కోటిన్నర జీతం ఇచ్చింది. ముంబై డాన్ బాస్కో స్కూల్ లో చ‌దివిన వివేక్ గిర్రెడ్డి… హైద‌రాబాద్ వాసి. 1వ‌ త‌ర‌గ‌తి నుంచి 12వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు ముంబై డాన్ బాస్కో స్కూల్ లో చ‌దివారు. ఎక‌నామిక్స్ అండ్ ఫైనాన్స్ లో లండ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఒక‌సంవ‌త్సరం డిగ్రీ చ‌దివారు. అనంత‌రం కెన‌డా మాంట్రియ‌ల్ లోని మెక్ గిల్ యూనివ‌ర్శిటీలో మూడేళ్లు చ‌దివాడు. ఆ తర్వాత ఎంబీఏ అంట్లాంటాలోని జార్జ్ టెక్ యూనివ‌ర్శిటీలో వంద శాతం స్కాల‌ర్ షిప్ తో ఎంబీఏ చేరాడు. ఈ ఏడాది మేలో వివేక్ ఎంబీఏ పూర్తవుతుండ‌గా.. అమెజాన్ నిర్వహించిన బిజినెస్ లీడ‌ర్ షిప్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం కింద చీఫ్ పైనాన్సియ‌ల్ అన‌లిస్ట్ గా ఎంపికయ్యారు. అన్ని క‌లుపుకుని ఏడాదికి వేత‌నం కోటిన్నర అంట‌. వివేక్ తండ్రి సూర్యనారాయ‌ణ రెడ్డి, త‌ల్లి భాను. వీరిది స్వస్థలం కాకినాడ కాగా… హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డారు.

About Author