అమెజాన్ సంచలనం.. లక్ష మంది ఉద్యోగుల పై వేటు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు లక్షమంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్‌లో ఉన్న మొత్తం సిబ్బందిలో 15లక్షమంది ఉద్యోగుల్లో లక్షమందిని విధుల నుంచి తొలగించాం. వారిలో ఫుల్‌ఫిల్ మెంట్ సెంటర్, డిస‍్టిబ్యూషన్ నెట్ వర్క్ ఉద్యోగులపై వేటు వేశారు. సిబ్బందిని తగ్గించడం, నియమించుకోవడం తగ్గిస్తే మంచిదని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.