వొడాఫోన్ లో అమెజాన్ రూ. 20 వేల కోట్ల పెట్టుబడి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. అమెజాన్‌తో పాటు కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్్టమెంట్ కంపెనీలతోనూ వొడాఫోన్ ఐడియా ప్రమోటర్ ఆదిత్య బిర్లా గ్రూప్ మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజాగా సమీకరించరబోయే నిధులను 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు వినియోగించుకోవాలని సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ధర సోమవారం 4.14 శాతం ఎగబాకి రూ.9.30కి చేరుకుంది.