PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఈ కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ.. ప్రైమ్ డే సేల్ కు సిద్ధమైంది. ఈనెల 26,27 తేదీల్లో ప్రైమ్ డే సేల్ పేరిట అమెజాన్ ఇండియా ఈ సేల్ నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇది జూన్ లో జ‌ర‌గాల్సి ఉండ‌గా… క‌రోన కార‌ణంగా ఆల‌స్యం అయింది. క‌రోన కార‌ణంగా దెబ్బతిన్న చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, త‌యారీదారుల‌కు చేయూత‌నిచ్చేందుకు ఈ సేల్ నిర్వహిస్తున్నట్టు అమెజాన్ ఇండియా ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. ఈ సేల్ లో మొబైల్ ఫోన్లు, కంప్యూట‌ర్లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. హెచ్ డీఎఫ్ సి బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈఎమ్ఐ కొనుగోళ్లపై 10 శాతం త‌క్షణ డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

About Author