ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవ్వడం లేదు..
1 min readకర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవ్వడం లేదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నగరంలోని పాతబస్టాండులో ఉన్న ఆయన విగ్రహానికి టి.జి భరత్, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఏపీలో అంబేద్కర్ రాసిన నిజమైన రాజ్యాంగం అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రతి పౌరుడు ముందుకొచ్చి ఓటు హక్కును సరైన విధంగా ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. ఇక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో తమ టిజివి సంస్థల తరుపున సహకారం అందించినట్లు టి.జి భరత్ గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇంచార్జి అర్షద్, దళిత జేఏసీ ఛైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, దళిత సంఘాల నాయకులు, టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.