ఇలాంటి సీఎం ఏపీకి వస్తారని అంబేద్కర్ ఊహించలేదు : ఆర్ఆర్ఆర్
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. తన నియోజకవర్గానికి జులై నాల్గోవ తేదీ ప్రధానమంత్రి మోడీ రాక సందర్భంగా తాను వెళ్లాల్సి ఉంటుందని ఆయన హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తనకు కావలసిన భద్రతను కల్పించే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిన్న విశాఖపట్నంలో కమిటీ మీటింగ్ కు వెళ్లాలనుకుంటే రనివ్వలేదన్నారు. ప్రధానమంత్రి సభ తన నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదని విమర్శించారు.