అంబేద్కర్ జయంతి ని అధికారికంగా నిర్వహించాలి
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎంసీపీఐ యు నాయకులు లాజరస్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అంబేద్కర్ జయంతిని ఈనెల 14 తేదీన ఘనంగా నిర్వహించాలని సోమవారం ప్రజా స్పందన కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా లాజరస్ మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు దళిత సంఘాలు రాజ్యాంగ పరిరక్షణ సమితి తదితర ప్రజాస్వామ్య వాదులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారుల సమక్షంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని శ్రీనివాసులు,డక్క కుమార్,పి మర్రిస్వామి,బొల్లెద్దుల ప్రసాద్ అన్నారు.