19 న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
1 min readరాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు భారీగా ప్రజలు తరలి రావాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మెన్ విక్టర్ ప్రసాద్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో పాత్రికేయులతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనుకోని రీతిగా అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉందని కావున కుల మతాలకు అతీతంగా దళిత సంఘాల ప్రజలు,ప్రజా సంఘాల నాయకులు,యువకులు,ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని ఆయన ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నెరవేర్చారని ఇది చారిత్రాత్మక ఘట్టం అని విజయవాడ నడి బొడ్డున 20 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర ప్రజలు జగన్ వెంటే ఉన్నారని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్,క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సుకుమార్,ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సభ్యులు నవీన్,గద్ద రాజశేఖర్,ఇమ్మానియెల్,ఎస్టీ నాయకులు శ్రీను నాయక్,శివ,దళిత నాయకులు కొమ్ము పాలెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.