NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా.బి.ఆర్​. అంబేద్కర్​ ఆశయ సాధనకు కృషి చేద్దాం..

1 min read

ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి… రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్​. అంబేద్కర్​ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆదోని అసెంబ్లీ కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. ఆదివారం డా.బి.ఆర్​. అంబేద్కర్​ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా.పార్థసారధి మాట్లాడుతూ అణగారిన వర్గాలను తొక్కేస్తారని గ్రహించి డా.బి.ఆర్​. అంబేద్కర్​… అప్పట్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్​, చదువులో రిజర్వేషన్​… ఇలా అన్నిటిలోనూ రిజర్వేషన్​ తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు. బీసీ వర్గానికి చెందిన తాను ఉన్నత చదువులు చదివి డాక్టర్ అయ్యానని, అలాంటి తానే ఎన్నో సార్లు అవమానాలకు గురయ్యాయనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబీకుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.  సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ స్థాయిలో ఉన్నామంటే… అది డా.బి.ఆర్​. అంబేద్కర్​ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు.  రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బి.ఆర్​. అంబేద్కర్​ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా డా. పార్థసారధి పిలుపునిచ్చారు. అనంతరం గుడిసె కృష్ణమ్మ, జనసేన ఇన్​ఛార్జ్​ మల్లప్ప, మదిరె భాస్కర్​ తదితరులు మాట్లాడారు. ఆ తరువాత వేసవి వేడిమి తట్టుకునేందకు ప్రజలకు ఉచితంగా మజ్జిగ, తాగునీరు అందజేశారు.

About Author