నూతన దంపతులకు అంబేద్కర్ చిత్రపటం అందజేత
1 min read
ఆలూరు న్యూస్ నేడు : కర్నూలు జిల్లా హాలహర్వి మండలం అర్ధగేరి గ్రామం నందు నేడు విద్యాసాగర్ వెడ్స్ సుమా వివాహానికి జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదగ,హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి అంబేద్కర్ చిత్రపటము అందజేసి,ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ…జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం స్థాపించినప్పటి నుంచి నేటివరకు 2357 అంబేద్కర్ చిత్రపటాలు అందజేసి అందరి ఇంట్లో దేవుళ్ళ ఫోటోలతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టుకొని పూజించే విధంగా కృషి చేస్తూ, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికి అంబేద్కర్ చిత్రపటాన్ని ఇస్తామని మాట్లాడం జరిగింది.ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా కన్వీనర్ గంధాలం మణికుమార్, ఆలూరు పంచాయతీ సెక్రెటరీ రాజన్న, పెళ్లి కుమారుడు తండ్రి సుంకప్ప, పెళ్ళికొడుకు బాబాయ్ నరసన్న, శ్రీనివాసులు శేఖర్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.