ఎల్ఐసీ ఐపీవో పై సందిగ్ధత
1 min readపల్లెవెలుగువెబ్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో పై సందిగ్ధత నెలకొంది. ఎల్ ఐసీ పెట్టుబడులు, ఆస్తుల విలువ మదింపు ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడమే ఆలస్యానికి కారణమని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తయితే తప్ప మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతి కోసం దరఖాస్తు చేయడం వీలవదు. ఎల్‌ఐసీ ఐపీఓకు సెబీతో పాటు ఐఆర్‌డీఏఐ అనుమతి కూడా అవసరం. విలువ మదింపే ఇంకా ఒక కొలిక్కి రాకపోతే వచ్చే మూడు నెలల్లో ఎల్‌ఐసీ ఐపీఓ ఎలా సాధ్యమ వుతుందని ఒక మర్చంట్ బ్యాంకర్ ఏకంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.