అదానీ చేతికి అంబుజా సిమెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్‌లో దిగ్గజ సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలు అదానీ గ్రూప్ గూటికి చేరనున్నాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్‌కు ఉన్న మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌తో కలిపి సుమారు రూ.81,360 కోట్లు కొనుగోలు చేసింది. ఈ మేరకు హోల్సిమ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. భారత సిమెంట్ రంగంలోనే కాకుండా భారత కార్పొరేట్ రంగంలోనే దీన్ని అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. హోల్సిమ్ కంపెనీకి అంబుజా సిమెంట్ ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటా మొత్తం అదానీ గ్రూప్ పరం కానుంది.