అంబులెన్స్ పై దాడి… వైసీపీ అరాచకానికి నిదర్శనం !
1 min readపల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్చార్జీ చదలవాడ అరవింద్ బాబు పై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. నిరసన తెలిపితే దాడులు చేయిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేయిస్తారా ? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల పై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్ పై దాడికి దిగడం వైసీపీ అరాచకానికి నిదర్శనమన్నారు. ఘర్షణకు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.