PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాకిస్థానీతో అమీషా ప‌టేల్ డేటింగ్.. క్లారిటీ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ‘బద్రి’ చిత్రంతో తళుక్కున మెరిసిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే అనేక కథనాలు వినిపించాయి. తాజాగా, ఆమె పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ అబ్బాస్… అమీషాకు కాలేజి స్నేహితుడు. ఈ మధ్య ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. దీనిపై అమీషా పటేల్ స్పందించింది. తనపై వస్తున్నవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ సిల్లీ కథనాలను చూసి నవ్వుకున్నానని వివరించింది. ఇమ్రాన్ అబ్బాస్ తనకు మిత్రుడు మాత్రమేనని, చాన్నాళ్ల తర్వాత అతడిని కలిశానని అమీషా వెల్లడించింది. దాంతో ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

                                    

About Author