PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంటిలోని… రాయిని తొలగించిన ‘అమీలియో’

1 min read

ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం… కంటి చూపు మెరుగుపరిచిన వైద్యులు

పల్లెవెలుగు వెబ్​: బిల్డింగ్​ కన్​స్ర్టక్షన్​లో పని చేస్తుండగా ఓ వ్యక్తి కంటికి కంకరరాయి బలంగా తగిలింది. ప్రమాదవశాత్తు తగిలిన రాయితో నల్లగుడ్డు తెగిపోయింది.. కంటి శుక్లము పగిలిపోయింది. తీవ్రం నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి  అమీలియో ఆస్పత్రి వైద్యులు చాకచక్యంగా శస్ర్తచికిత్స చేసి… కంటి చూపు తిరిగి వచ్చేలా చేశారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని చిరుమాన్​దొడ్డి గ్రామానికి చెందిన హనుమంతప్ప (69) బిల్డింగ్​ కన్​స్ర్టక్షన్​లో పని చేస్తుండగా కంకర రాయి బలంగా కంటికి తగిలింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న హనుమంతప్ప ఈ నెల 21న అమీలియో ఆస్పత్రిలో చికిత్స కోసం సంప్రదించారు.  కార్నియా మరియు ఫాకో స్పషలిస్ట్​ డా. మునీర బేగం పరీక్షించి రోగి యొక్క నల్లగుడ్డు తెగిపోయి, కంటి శుక్లము పగిలిపోయి , 1 సెం.మీ. కంకర రాయి కంటిలోపుల ఉన్నట్లు గుర్తించారు. అదేరోజు రోగికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా తెగిపోయిన నల్లగుడ్డుకు 4 కుట్లు వేసి.. గుడ్డును సరి చేయడంతోపాటు కంటిలోపల ఉన్న కంకర రాయిని మరియు దెబ్బతిన్న శుక్లాన్ని  తీసి వేశారు. శస్ర్తచికిత్స తరువాత రోగికి కంటిచూపు మెరుగవ్వడంతోపాటు కంటి  ఇన్​పెక్షన్​  కూడా తగ్గింది.  ఈ సందర్భంగా కార్నియా మరియు ఫోకో స్పెషలిస్ట్​ డా. మునీర బేగం మాట్లాడుతూ  ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల కొరకు  మరియు అన్ని రకాల  నల్లగుడ్డు ( కార్నియా) సమస్యలకు హైదరాబాద్​;  బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లకుండా ఇప్పుడు  కర్నూలు నగరంలోని అమీలియో ఆస్పత్రిలో  ఈ సౌకర్యం ఉందని తెలియజేశారు.  కంటికి దెబ్బ తగిలిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కంటి డాక్టర్లును సంప్రదించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. అనంతరం   అమీలియో ఆస్పతి మేనేజింగ్​ డైరెక్టర్​ డా. సి. లక్ష్మీ ప్రసాద్​ మాట్లాడుతూ ఇలాంటి కిష్ట కేసులను కార్నియా స్పెషలైజేషన్​, లెన్స్​ స్పెషలైజేషన్​ చేసిన  వైద్యులు మాత్రమే చేస్తారని, కానీ  అమీలియో ఆస్పత్రిలో నల్లగుడ్డు మీద 2సం.. విశేష శిక్షణ పొంది ఉన్న డా. మునీర బేగం  ఆధ్వర్యంలో అరుదైన  కంటి చికిత్స సాధ్యమైందని మరియు ప్రజలందరూ  ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  రోగి హనుమంతప్ప మాట్లాడుతూ ఈ శస్ర్తచికిత్స అంతా ఆరోగ్య శ్రీ  కింద ఉచితంగా చేసి… కంటి చూపును మెరుగు పరిచినందుకు  అమీలియో ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

About Author