‘ అమీలియో’ను ఆదర్శంగా తీసుకోవాలి
1 min read– ప్యాలకుర్తి ప్రజలు
పల్లెవెలుగు వెబ్, ప్యాలకుర్తి: కర్నూలు జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్న అమీలియో ఆస్పత్రి యాజమాన్యాన్ని మిగతా ఆస్పత్రుల నిర్వాహకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ప్యాలకుర్తి ప్రజలు. గురువారం కర్నూలు జిల్లా ప్యాలకుర్తి గ్రామంలో జుట్లవారి ఆధ్వర్యంలో అమీలియో హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్యులు యూనీస్ (జనరల్ మెడిసిన్), యశోద (గైనకాలజిస్ట్), వీరేంద్ర (ఆప్తోల్మాలజీ) రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటిచూపు, షుగర్, బీపీ, ఈసీజీ, తదితర పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచితంగా మందులు, కరోనా నేపథ్యంలో ఉచిత మాస్కులు పంపిణీ చేశారు.
అనంతరం ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న జుట్ల వెంకటేశ్వర్లు, జుట్ల శేఖర్, జుట్ల హేమంత్ మాట్లాడుతూ డాక్టర్లు దైవంతో సమానమని, ప్రజలు ఎక్కడ ఇబ్బందులలో ఉన్న అక్కడికే వెళ్లి పట్టణ,గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించడం సంతోషకరమన్నారు. అమీలియో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ చాపె సేవలను ప్రశంసించారు. ఆ తరువాత గైరాబోని లక్ష్మీ నారాయణ,దొడ్ల భాస్కర్, ఖలీల్ భాషా,విజ్జికుమార్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించి ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమీలియో వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల కోసం తమను (9951923623) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు,అమీలియో సిబ్బంది పాల్గొన్నారు.