ఆ వైరస్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన అమెరికా !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది. మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్‌పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు.