ఉపగ్రహాన్ని కూల్చిన రష్యా.. మండిపడ్డ అమెరికా
1 min read
పల్లెవెలుగు వెబ్: అమెరికా…. రష్యా మధ్య ఒకప్పుడు కోల్డ్ వార్ కొనసాగింది. ప్రపంచ దేశాలపై ఈ రెండు దేశాలు పెత్తనం చెలాయించేవి. అయితే యూఎస్‌ఎస్‌ఆర్‌గా ఉన్న రష్యా తరువాత విచ్చిన్నం కావడంతో ప్రపంచంపై ఆదేశ ప్రభావం తగ్గుతూ వస్తుంది. మరోపక్క అమెరికా అగ్రరాజ్యంగా వెలుగుతూ ప్రపంచ దేశాలపై పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఆయుధ సామాగ్రి సమకూర్చుకోవడం, అంతరిక్షంలో పెత్తనం చెలాయించడంలో ఈ రెండు దేశాలు పోటీ పడుతుంటాయి. ఇటీవల సొంతంగా తయారు చేసుకున్న యాంటి శాటిలైట్ క్షిపణిని ప్రయోగించిన రష్యా… తన సొంత ఉపగ్రహాన్ని కూల్చివేసింది. దీంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించి.. బాధ్యత లేని దేశమంటూ ఫైర్ అయింది. ఉపగ్రహాన్ని కూల్చడంతో అంతరిక్షంలో గ్రహ శకలాలు పెరిగిపోతాయని.. అవి ఉపగ్రహాలను ఢీకొట్టే అవకాశం ఉంటుందని మండిపడింది. ఈ ప్రభావం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌పై పడుతుందని అమెరికా ఆరోపించింది.