సూదిరెడ్డి పల్లిలో ‘అమీలియో’ ఉచిత వైద్యశిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా సూదిరెడ్డి పల్లి గ్రామంలో గురువారం పసుపుల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీలియో హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్యులు యూనీస్ (జనరల్ మెడిసిన్), యశోద (గైనకాలజిస్ట్), వీరేంద్ర (ఆప్తోల్మాలజీ) రోగులకు వైద్య పరీక్షలు చేశారు. కంటిచూపు, షుగర్, బీపీ, ఈసీజీ, తదితర పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచితంగా మందులు, కరోనా నేపథ్యంలో ఉచిత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పసుపుల సొసైటీ ప్రెసిడెంట్ శేష రెడ్డి, సెక్రటరి మురళీధర్ చౌదరి మాట్లాడుతూ కర్నూలు అమీలియో ఆస్పత్రి ఎండీ లక్ష్మీ ప్రసాద్ చాపె నేతృత్వంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం అమీలియో వరప్రసాద్ మాట్లాడుతూ ఉచిత వైద్య చికిత్సల కోసం తమను (9951923623) గ్రామీణ పెద్దలు సంప్రదించవచ్చన్నారు.