అమిత్ షా పర్యటన.. లొంగిపోయిన ఆదివాసి మిలిటెంట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటనకు ముందే ఆసోంలోని తీవ్రవాద సంస్థ ఆల్ ఆదివాసి నేషనల్ లబరేషన్ ఆర్మీకి చెందిన సుమారు 13 మంది క్యాడర్ లొంగిపోయారు. కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని భద్రతా బలగాల సమక్షంలో వీరు సరెండర్ అయ్యారు. అమిత్షా ఆదివారం సాయంత్రం నుంచి అసోంలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఆదివాసీ మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలు విడిచిపెట్టి అసోం పోలీసుల ముందు లొంగిపోయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.