జాతీయ జెండా పట్టుకునేందుకు అమిత్ షా కొడుకు నిరాకరణ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆసియా కప్ 2022లో ఆగస్ట్ 28న దాయాది పాక్‌తో జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా వ్యవహరించిన తీరు అతని తండ్రి ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరకాల ప్రత్యర్ధితో నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా విజయానంతరం సంబురాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత దేశ ఖ్యాతి విశ్వమంతా తెలిసేలా ఎలుగెత్తి చాటారు. ఈ క్రమంలో స్టేడియంలోనే ఉన్న జై షాకు ఓ అభిమాని త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకు జై షా నిరాకరిస్తూనే.. చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించాడు. జై షా ఇలా ప్రవర్తించడం ప్రతి భారత అభిమానికి అగ్రహం తెప్పించింది. జై షా వ్యవహరించిన తీరును అతని తండ్రి ప్రత్యర్ధులు ఏకి పారేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి తనయుడి దేశ భక్తి ఇదేనా అంటూ మాటల తూటాలు సంధిస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.