NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమితాబ్ స‌ర‌స‌న ర‌ష్మిక

1 min read

క‌న్నడ బ్యూటీ ర‌ష్మిక మండ‌న్న త‌న 25వ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 5 ఆమె బ‌ర్త్ డే. అయితే.. బ‌ర్త్ డే రోజున కూడ ప‌నిలో నిమ‌గ్నమైపోయారు ర‌ష్మిక‌. బాలీవుడ్ బాద్షా.. బిగ్ బి.. అమితాబ్ బ‌చ్చన్ స‌ర‌స‌న ‘ గుడ్ బ‌య్’ అనే మూవీలో న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక త‌న బ‌ర్త్ డే సెలెబ్రేష‌న్స్ గురించి స్పందిస్తూ అమితాబ్ తో న‌టించడ‌మే త‌న‌కు పెద్ద బ‌ర్త్ డే గిఫ్ట్ అని అన్నారు. బ‌ర్త్ డే రోజు మొద‌టిసారి షూటింగ్ లో పాల్గొంటున్నట్టు ఆమె తెలిపారు. త‌న జీవితంలో మ‌రిచిపోని బ‌ర్త్ డే అని చెప్పుకొచ్చారు. తెలుగులో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ క‌న్నడ భామ‌.. బాలీవుడ్ లో కూడ ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ స‌ర‌స‌న ‘గుడ్ బ‌య్’ అనే మూవీలో లీడ్ రోల్ లో న‌టిస్తున్నారు.

About Author