సన్మార్గానికి దారి చూపేవే సత్సంగాలు అమ్ముల సాంబశివరావు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.సత్సంగాలు సాయి సేవకులు,సాయి భక్తులే కాకుండా ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడిచేందుకు దారి చూపుతాయని అమ్ముల సాయి విద్యాపీఠ్ పూజ్య గురువులు శ్రీ అమ్ముల సాంబశివరావు అన్నారు. బనగానపల్లె పట్టణ సమీపంలోని యాగంటిపల్లె రహదారిలోని శ్రీ శిర్ధి సాయిబాబా సేవాశ్రమంలోఈనెల 15 నుంచి 22 వరకు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయిసేవకులు,భక్తులనుద్దేశించి సత్సంగ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తుల నుంచి అందిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసాయి సేవకులకు సత్సంగం బోధించడంలో చక్కటి ప్రావీణ్యం ఉందని అయితే నన్ను గురువుగా అనుసరించి నా ద్వారా ఏదైనా విందాం అని నన్ను అనుసరించే వారికి ,అందరి సమస్యలు తీర్చలేకున్న, అందరినీ కలవలేకపోయినా ఒక సదుద్దేశంతో అప్పుడప్పుడు ఈ సత్సంగ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొంటున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా గురువు అనే మాటకు అర్థం వివరిస్తూ అసలు గురువు అంటే మనం చేసే పనుల్లో పాప పుణ్యాలను ఏమిటో తెలియజెప్పవాడే గురువు అని అర్థమని ఆయన వివరించారు. సత్సాంగప్రవచనాలు అనంతరం రాత్రి సాయిబాబా విగ్రహానికి పుష్పభిషేకం, సాయికథ గానరూపకం కార్యక్రమాలు ఆశ్రమ కమిటీ నిర్వహకులచే ఘనంగా జరిగాయి.