శ్రీ షిర్డీసాయి మందిరాన్ని దర్శించిన అమ్ముల సాంబశివరావు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం అవుకు రహదారిలోని ఎస్ఆర్బిసి కాలనీలో ని శ్రీ శిర్ధి సాయిబాబా మందిరాన్ని అమ్ముల సాయి విద్యాపీఠ్ వ్యవస్థాపకుడు అమ్ముల సాంబశివరావు మంగళవారం సందర్శించారు. 1998లో తాను స్వయంగా ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ శిర్ధిసాయిబాబా మందిరంలో శ్రీ సాయి విద్యాపీఠం వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు మంగళవారం మందిరం కమిటీ ఆహ్వానం మేరకు ఉదయం సాయి మందిరానికి విచ్చేసి సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరామ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి గుండా రవికుమార్, ఉపాధ్యక్షుడు మధుసూధనరెడ్డి , డి మధు సూధన రెడ్డి, దేశు బాలరాజు,గౌరవ అధ్యక్షుడు గుండా శ్రీనివాసులు గౌరవ సలహాదారులు ముత్తుకూరు శ్రీనివాసులు, గాదంశెట్టి వేణుగోపాల్, ఉన్నూరు బాబు, మద్దిలేటి రెడ్డి, వై మద్దిలేటిరెడ్డి, నాగప్రసాద్, ప్రసాద్, శివచంద్ర, సురేష్ కుమార్ ,కమిటీ సభ్యులు ఆయనను పూర్ణకంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అమ్ముల సాంబశివరావు ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపి తన ఆశీర్వచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.