వ్యాక్సిన్ వేసుకున్న వారిలో.. తక్కువ వైరల్ లోడ్ !
1 min readపల్లెవెలుగు వెబ్: వ్యాక్సిన్ వేసుకున్నాక కోవిడ్ బారినపడిన వారిలో వైరల్ లోడ్ తక్కువగా ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఇస్తున్న రెండు ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల పై చేసిన అధ్యయనం ఆధారంగా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్దారించారు. ప్రస్తుతం కరోనాకు మంచి వ్యాక్సిన్లు వచ్చాయని, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో అవి సమర్థంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది . ఏ వ్యాక్సిన్ కూడ వంద శాతం సమర్థతతో పనిచేయదు, వ్యాక్సిన్ పొందాక కూడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల 90 శాతం మేర కరోనకు అడ్డుకట్టపడుతుందని, వైరస్ సోకినా వైరస్ లోడ్ తక్కువేనని అరిజోన విశ్వవిద్యాలయ పరిశోధకుడు జెఫ్ బర్జెస్ పేర్కొన్నారు.