పాల ధర పెంచిన ‘అమూల్’ కంపెనీ
1 min read
పల్లెవెలుగు వెబ్ : అమూల్ కంపెనీ పాల ధరలను పెంచింది. లీటరు పై 2 రూపాయలు పెంచినట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ పెంపు అమూల్ కంపెనీకి చెందిన అన్ని బ్రాండ్లకు వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు 19 నెలల తర్వాత పాల ధరలు పెంచినట్టు అమూల్ ప్రకటించింది. ప్యాకింగ్, రవాణ, ఇంధన ఖర్చులు పెరగడంతో పాల ధరలు పెంచుతున్నట్టు జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్ఎస్ శోధి తెలిపారు.