PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠాశాల రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి

1 min read

పల్లెవాణి వెబ్ కర్నూలు: మనిషి జీవితంలో ముఖ్యంగా 4 రకాల రుణాలు ఉంటాయి. అవి 1)మాతృ రుణం- తల్లికి సేవ చేసి రుణం తీర్చుకోవాలి… 2)పితృ రుణం – తండ్రికి సేవ చేసి రుణం తీర్చుకోవాలి.. 3) దేవ రుణం – దేవునికి సేవ చేసి రుణం తీర్చుకోవాలి…. 4) ఋషి రుణం(గురు రుణం)- చదువు చెప్పిన గురువులకు లేదా గురుకులం (అంటే పాఠాశాల ) కు సేవ చేసి రుణం తీర్చుకోవాలి..సాధారణంగా పై మూడు రుణాలు అందరూ తీర్చుకుంటారు.. కానీ 4వ రుణం గురు రుణం  చాలా తక్కువ మంది మాత్రమే తీర్చు కుంటారు.కారణం ఆ అవకాశం తక్కువ మందికే లభిస్తుంది.. కానీ పై మూడు రుణాలు వ్యక్తిగత మైనవి. కానీ 4వ రుణం  సమాజ హితానికి ఎంతో తోడ్పడుతుంది.అలాంటి గురు రుణాన్ని మన నందనపల్లి mpp పాఠశాలలలో సుమారుగా (1964-68 ) 60 ఏళ్ల క్రితం విద్యను అభ్యసించిన, తన చిన్న నాటి పాఠాశాల రుణం తీర్చుకోవాలనే తపన తో పూర్వ విద్యార్థి అయిన KDCC బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీ ఆంజనేయులు గౌడ్  నేను సైతం పాఠాశాల అభివృద్ధి లో సమిధనవుతా అంటూ…పాఠాశాలకు 50 వేల పైన విలువ చేసే కంప్యూటర్,మరియు ప్రింటర్ ను విరాళంగా ప్రకటించారు.వారి కుమారుడు శ్రీ రేణుక ఎల్లమ్మ పెట్రోల్ బంక్ అధినేత శ్రీ చరణ్   గురువారం వచ్చి  పాఠాశాలలో కంప్యూటర్ ప్రింటర్ ను బహుకరించారు.. ఈ సందర్భంగా పాఠాశాల ప్రధానోపాధ్యాయులు  కె. చంద్రశేఖర్ , ఉపాధ్యాయిని శ్రీ కె.స్వర్ణలత , విద్యార్థులు పాఠాశాల తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ  మును ముందు కూడా వారి సహకారాన్ని ఇలాగే అందించాలని హృదయ పూర్వకంగా కోరుతున్నాము.

About Author