బాధ్యతగా అంబులెన్స్ ను పిలిపించి హాస్పిటల్ కు తరలించాలి
1 min read– ప్రమాద జరిగిన వారికి సహాయం చేయడం మనందరి బాధ్యత
– డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె శ్రీధర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని 34 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల లు 5 వ రోజు కొనసాగుతున్నాయి (GOOD SAMARITAN) అనే కార్యక్రమాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరియు కిమ్స్ హాస్పిటల్ లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GOOD SAMARITAN అనే అంశంపై డిటిసి కె శ్రీధర్ మాట్లాడుతూ డాక్టర్లకు హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించారు. అవి ఏమనగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ ను పిలిపించి హాస్పిటల్కు తరలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో గంటకు ఒకరు చొప్పున బలి అవుతున్నారు. రహదారి పైన ప్రమాదం జరిగినపుడు, ప్రమాద బాధితులను రక్షించడంలో మొదటి 60 నిమిషాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, మరియు మరణాలు తగ్గించడానికి చాలా కీలకమైనవి. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారెవరైనా బాధితులకు సహాయం చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి సంకోచిస్తారు. సహాయం చేసిన వారిని కూడా మెడికో లీగల్ కేసులో భాగంగా పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది ఇబ్బంది పెడతారనే భయంతో చాలా మంది సహాయం చేయడానికి కూడా సంకోచిస్తారు. రహదారి ప్రమాదాల్లో సహాయం చేసే వారికి రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం నూతన చట్టం తెచ్చిందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే శ్రీధర్ అన్నారు,రహదారి ప్రమాద బాదితులకు సహా యకారిగా వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది వేధించకూడదు. బాధితుడిని అడ్మిట్ చేసుకోవాలి గాని, సహాయకుని గుర్తింపుగాని, చిరునామా గాని అడిగి వేధించకూడదని డాక్టర్లకు తెలిపారు. పోలీసు స్టేషన్లో కూడా కేసు విషయంలో సహాయకారిని ఏ విధమైన ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగకూడదు. వారి సాక్ష్యం కోసం బలవంతం చేయకూడ దన్నారు.తప్పని పరిస్థితుల్లో సాక్ష్యం కోసం స్వయంగా ముందుకు వచ్చిన సహాయకారిని సంబంధిత కోర్టు విచారణ ఒక రోజులోనే ముగించాలి. రెండవసారి పిలవకూడదు.రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేసిన వ్యక్తులకు గౌరవ సూచకంగా రూ. 5000/- మించకుండా పారితోషికం జిల్లా కలెక్టర్ మంజూరు చేయవచ్చు. వారి సేవలను గుర్తిస్తూ వారికి ఒక యోగ్యతా పత్రం కూడా ఇస్తారన్నారు.పైన పేర్కొన్న చట్టాలను అమలుపరచడం ఒక బాధ్యతగా ఈ హాస్పిటల్ యాజమాన్యం గుర్తిస్తుంది.బాధితునికి సహాయం చేయడంలో సహాయకారి (GOOD SAMARITAN) సేవలను సహృదయంతో • సహాయకారిని ఇబ్బందికి గురి చేయకుండా బాధితునికి సహాయ చర్యలు వెంటనే చేపడతాం.ఈ కార్యక్రమంలో ఆర్టిఓ రమేష్ ఎం వి ఐ లు మనోహర్ రెడ్డి, రవీంద్ర కుమార్, బాబు కిషోర్, ఆర్టిఏ కానిస్టేబులు, మరియు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు, మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.