NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ అప్పుల‌పై ఆడిట్ జ‌రిపించాలి : ఎంపీ ర‌ఘురామ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ జ‌రిపించాల‌ని న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. 25వేల కోట్ల అప్పుపై పూర్తీ స్థాయిలో కాగ్ ఆడిట్ జ‌రిపించాల‌ని మోదీకి లేఖ రాశారు. ప్రభుత్వం ఖ‌ర్చు చేసే నిధుల‌కు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేష‌న్ పేరిట ఎందుకు తీసుకుంటున్నార‌ని ప్రశ్నించారు. సంక్షేమ ప‌థ‌కాల కోసం సంవ‌త్సరానికి 10 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు చేశార‌న్న స‌మాచారం ఉంద‌న్నారు. చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి.. ప్రచారాలు చేసుకుంటున్నార‌ని ర‌ఘురామ మండిప‌డ్డారు. అంతిమంగా ఈ అప్పుల‌కు ఎవ‌రు బాధ్యత వ‌హిస్తార‌ని అన్నారు. ఇవాళో రేపో వేటు ప‌డే వ్యక్తి మాటలు ఎందుకు వినాలి అని అనుకోవ‌ద్దని హిత‌వు ప‌లికారు.

About Author