NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేతు విశ్వనాథరెడ్డి పేరుతో- పురస్కారం ఏర్పాటు చేయాలి

1 min read

– మొల్లసాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గానుగ పెంట హనుమంతరావు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రముఖ సాహితీ వేత, కేంద్ర అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత కథాచక్రవర్తి కేతు విశ్వనాథరెడ్డి పేరుతో ప్రతి ఏటా పురస్కార అవార్డు ఏర్పాటు చేయాలని, మహా కవయిత్రి మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గానుగుపెంట హనుమంతరావు అన్నారు, గురువారం సాయంత్రం మండల పరిధిలోని శాటిలైట్ సిటీ వద్ద గల మొల్ల సాహితీ పీఠం ఆధ్వర్యంలో కేతు విశ్వనాథరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా గానుగ పెంట హనుమంతరావు, ప్రతినిధులైనటువంటి న్యాయవాది ఆదినారాయణ రావు లు మాట్లాడుతూ, సాహిత్యంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని సాహితీ ప్రియుల కొరకు అనేక కథలు, అనేక సాహిత్యాలు, రచించడమే కాకుండా, తన సాహిత్యాలతో ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేసినటువంటి ఘనత కేతు విశ్వనాథ రెడ్డికి దక్కుతుందని వారు తెలియజేశారు, ఇంతటి మహోన్నతమైన వ్యక్తి పేరుతో ప్రతి ఏటా సాహితీవేతలకు, రచయితలకు అవార్డులతో సత్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, అంతేకాకుండా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి కేతు విశ్వనాథరెడ్డి, ఎంతో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన అభిమానులు, వర్ర మునయ్య, లక్ష్మయ్య, భరత్ లు అన్నారు, అదేవిధంగా కేతు విశ్వనాథ రెడ్డి కుటుంబం తో పాటు ఆయన శిష్యగణం కూడా ఈ విషయంలో కేతు విశ్వనాథరెడ్డి పేరుపైన ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకోనున్నట్లు తెలిపారు.

About Author