PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఆదోని’లో ఉత్సాహంగా యువగళం

1 min read

– అడుగడుగునా యువనేతకు ఘనస్వాగతం, నీరాజనాలు
– పెద్దతుంబళంలో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం
పల్లెవెలుగు వెబ్ ఆదోని: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం 78వరోజు పాదయాత్ర ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు. పెద్ద తుంబళంలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభి,చింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు లోకేష్ ను చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చారు. యువనేత రాకతో పెదతుంబళం ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. అడుడుగునా జనం యువనేతను చూసేందుకు పోటీపడ్డారు. తనని కలవడానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఆదోని శివారు కడితోట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వికలాంగుడు దూదేకుల ఇస్మాయిల్ తన గోడు విన్పిస్తూ 3 ఎకరాల పొలం ఉంటే 30ఎకరాలు ఉందంటూ పెన్షన్ పీకేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గణేకల్లు గ్రామస్తులు యువనేతను కలిసి తమ గ్రామంలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను యువనేత దృష్టికి తెచ్చారు. గణేకల్లు శివారులో సజ్జరైతును కలిసి ఆయన ఇబ్బందులను తెలుసుకున్నారు. జాలిమంచి గ్రామస్తులు తమ గ్రామానికి తాగు,సాగునీటి సమస్య పరిష్కరానికి ఎల్ఎల్ సి కెనాల్ నుంచి ఎత్తిపోతల పథకం నిర్మించాలని కోరారు. కుప్పగల్ వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బిసిలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే న్యాయవాదులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక అందరికీ అండగా నిలుస్తామని చెప్పి యువనేత ముందుకు సాగారు. భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్ర పెదతుంబళం మీదుగా తుంబళం క్రాస్ వద్ద విడిదికేంద్రానికి చేరుకుంది. మంచి నీళ్లు అడిగానని రెండు రోజులు జైళ్లో పెట్టించారు
-బంట్రోతు జగదీష్, కాపటి, ఆదోని మండలంగ్రామసభలో గ్రామంలోని నీటి సమస్యపై మాట్లాడాను. కానీ వైసీపీ నేతలు నాపై పోలీసులను పంపి అరెస్టు చేయించి రెండు రోజులు జైల్లో పెట్టించారు. నీటి సమస్య గురించి మాట్లాడటం తప్పా? డిగ్రీ బిఎస్సీ చదవి నాలుగేళ్లుగా ఖాళీగా ఉంటున్నా. బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఎల్ అండ్ టీ సంస్థ తరపున కాంట్రాక్టు ఉద్యోగం ఏడాదిపాటు చేశా. కరోనా రావడంతో తొలగించారు. జాబ్ నోటిఫిషన్లు కూడా లేకపోవడంతో పొలం పని చేసుకుంటున్నా. తాపీ మేస్త్రీలకు ఈ ప్రభుత్వంలో పని దొరకడం లేదు-కుమ్ములదిన్నె తిక్కస్వామి, కుప్పగల్, ఆదోని మండలం ఆదోని నియోజకవర్గంలో మొలిగనూరు నుండి ఇసుక రవాణా జరుగుతుంది. ప్రభుత్వ కొత్త ఇసుక విధానం తీసుకురావడంతో ఒక్కో టిప్పర్ రూ.22 వేల పెట్టి కొనాల్సి వస్తోంది. ట్రాక్టర్ల ప్రకారం అమ్మనివ్వడం లేదు. తోలుకుంటే ట్రిప్పర్ తోలుకోవాల్సిందే. జగనన్న కాలనీల నిర్మాణంలోకే నేను పనికి వెళ్తా. నెలకు మహా అయితే 6 రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగతా రోజులు ఖాళీగా ఉంటున్నా. లబ్ధిదారులను గట్టిగా కూలీ అడగాలన్నా మనసు రావడం లేదు. వాళ్లు కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు.

About Author