సమస్యల పై సర్వ గళమెత్తిన ఎంపీపీ
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చెన్నూరు మండలంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల పై ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్ గళమెత్తారు.ఈ సందర్భంగా ఎంపీపీ విలేకరులతో మాట్లాడుతూ చెన్నూరు నేషనల్ హైవేకి సంబంధించి చాలా సమస్యలు అటు నేషనల్ హైవే అధికారులకు, ఇటు మండల అధికారులకు జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ పనుల పురోగతి నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదని సర్వ సభ్య సమావేశం లో చర్చించడం జరిగిందన్నారు.అంతేకాకుండా నేషనల్ హైవే బాధితులకు నేటికి కూడా ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని, బాధితుల తరపున సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగతిన బాధితులకు 3 సెంట్ల ప్రకారం ఇంటి స్థలం మంజూరు చేయాలని,అలాగే వారికి ప్రభుత్వ పక్క గృహం ఇవ్వాలని ఆయన అధికారులను కోరడం జరిగిందన్నారు.అలాగే చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకే చోట ఉండటం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు పిహెచ్ సి ,సిహెచ్ సి ఒకే చోట ఉండడం కారణం చేత సక్రమమైన వైద్యం అందడం లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మండలంలోని కొండపేట గ్రామానికి తరలించాలని ఆయన జిల్లా అధికారులను కోరడం జరిగిందన్నారు.అంతేకాకుండా పలు కాలనీల్లో ఇంటి పైన ఉన్న కరెంటు తీగలు,కొత్తగా ఏర్పడిన కాలనీలకు విద్యుత్తు సప్లై,అలాగే పంట పొలాలలో ఎత్తు తక్కువలో ఉన్న విద్యుత్ స్తంభాలు,పొలాల్లో ఒరిగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి తీగలు గూడా పైకి లాగడం వంటి పనుల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అదే విధంగా గృహ లబ్ధిదారులు స్వంత స్థలాల్లో ప్రభుత్వ పక్కా గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా కొత్తగా ప్రభుత్వ పక్కా గృహాలు మంజూరు చేయాలని ఇప్పటికే కొంతమంది సొంత ఇంటి స్థలాల్లో బేస్ మట్టాలు నిర్మించుకొని ఉన్నారని వాటికి ప్రభుత్వ పక్కా గృహాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది తెలిపారు.పై సమస్యలన్నీ జిల్లా కలెక్టర్,అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు విన్నవించడం జరిగింది.