పుడమి తల్లి రుణం తీర్చుకునే సదవకాశం.. కార్పొరేటర్ శ్వేతారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ కల్లూరు : కర్నూల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువులు పాత పుస్తకాలు రీ సైకిల్ చేసే ఈ సెంటర్స్ ను మే 22 నుండి జూన్ 5 2023 వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41 వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగిందని బుధవారం నాడు 41 వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి తెలిపారు వార్డులోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.ఈ సెంటర్స్ ద్వారా ప్లాస్టిక్ వస్తువులు, పాత పుస్తకాలు మరియు పేపర్లు, వాడిన వస్త్రాలు మరియు వస్తువులు సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయబడును. కావున ప్రజలందరూ ఇటువంటి వస్తువులు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు స్వచ్ఛందంగా రీసైకిల్ సెంటర్ కు ఇచ్చి అందుకు ప్రతిగా సేంద్రియ ఎరువులను పొంది పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు 41 వ వార్డులోని 107. 108 . సచివాలయాల దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.