సాధారణ ఎలక్ట్రిషియన్ ఓ దీవికి రాజయ్యాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : వాయవ్య ఇంగ్లాండ్‌లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది ‘పీల్ ఐలాండ్’ అనే దీవి. దీని విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ దీవిని సొంతం చేసుకోవడానికి సుమారు రెండువందల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అదృష్టం వరించడంతో ఆరన్ సాండర్సర్ అనే ముప్పయి మూడేళ్ల సామాన్య ఎలక్ట్రీషియన్ ఈ దీవిని ఇటీవల సొంతం చేసుకోగలిగాడు. అంతేకాదు, 170 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ‘కింగ్ ఆఫ్ పీల్ ఐలాండ్’గా త్వరలోనే పట్టాభిషక్తుడు కానున్నాడు. పర్యాటకులు ఇక్కడి టెంట్లలో బస చేస్తుంటారు. టెంట్లలో బస చేయడానికి రోజుకు 5 పౌండ్లు (సుమారు రూ.500) వసూలు చేస్తారు. చిరకాల సంప్రదాయం ప్రకారం క్రంబియా కౌంటీ ఈ దీవిలోని పబ్‌ను నడిపేందుకు టెండర్లు ఆహ్వానించింది. రెండువందల మందికి పైగా దీనిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు ఆరన్ సాండర్సన్‌కు ఇది దక్కింది. పబ్ యాజమాన్యంతో పాటు, దీవికి రాజుగా పట్టాభిషేకం, దాంతో పాటే ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనుగ్రహించే ‘నైట్‌హుడ్’ కూడా ఇతడికి త్వరలోనే దక్కనున్నాయి.