వైసిపి పాలనలో రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య..
1 min readటిడిపి బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కడప : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాలుగున్నర సంవత్సరాల పాటుఎదురుచూసి ఒకవైపు వయస్సు పెరిగి, మరోవైపు కోచింగులు తీసుకోవడానికి డబ్బులు లేక, ఆర్థిక స్థితిగతులు సరిగా లేక యువత నిరాశలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టిడిపి బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రెగ్యులర్ డిఎస్సీ నిర్వహిస్తామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్లు విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు వాటి ఊసే ఊసే లేదని మండిపడ్డారు.టిడిపి ప్రభుత్వ హయాంలో యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వడం కోసం బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారని వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువత ఉచిత కోచింగ్ తీసుకొని మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు.రాష్ట్రంలో అధిక మంది జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గం యొక్క ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్నాయని అలాంటి నేపథ్యంలో వేల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా యువత అధికంగా ఈరోజు బడుగు బలహీన సామాజిక వర్గాల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1345 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు అంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ప్రదర్శన ప్రదర్శిస్తున్న తీరుకు నిదర్శనం మరోవైపున స్వయం ఉపాధి కోసం గతంలో ఇచ్చేటువంటి బీసీ సబ్సిడీ రుణాలను పూర్తిగా రద్దుచేసి అటు స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాలు లేక యువతను రోడ్డుకీడ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే… ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డయ్య యాదవ్, జిల్లా నాయకులు మణికంఠ పాల్గొన్నారు.