PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆనంద నిలయం అభినందన సభ…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ హనుమాన్ కళా సమితి ఆధ్వర్యంలో కర్నూలునగరం నందలి యునైటెడ్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఆనంద నిలయం భక్తి రస పద్య నాటకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాల్లో ఎన్నికైన శుభ సందర్భంగా దర్శకులు వివి రమణారెడ్డి మహిళా పాత్రధారి యం ఆర్ రాధిక ను శ్రీ హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు పి హనుమంతరావు చౌదరి సమన్వయకర్త బైలుప్పల షఫీయుల్లా కోశాధికారి వివి రమణ చారి ఘనంగా సన్మానించారు. ఆనంద నిలయం అభినందన కార్యక్రమానికి యునైటెడ్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బలరాం కోశాధికారి సుధాకర్ గౌడ్ , జి అంకయ్య రంగస్థల దర్శకులు కె.వి.రెడ్డి పాల్గొని కర్నూలు జిల్లా నుండి రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలకు ఆనంద నిలయం నాటకం పోటీలలో నిలవడం చాలా ఆనందదాయకమని దర్శకుడు వివి రమణారెడ్డి చేస్తున్న కృషి చాలా అభినందించదగ్గ విషయమని కళాకారులు పూర్తిస్థాయిలో రాణించి రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లాకు బంగారు నందులు తీసుకురావాలని కోరారు. ఆనంద నిలయం నాటకంలో పాత్రలు పాత్రధారులు సహకరిస్తున్న తీరు చాలా ప్రశంసనీయమైనదని దర్శకులు వివి రమణారెడ్డి పాత్రలు పాత్రధారులను రచయిత పల్లెటి లక్ష్మీ కులశేఖర్ శ్రీ స్వామివారి నిజరూప దర్శనం ఆనంద నిలయం పద్య నాటకం ఎన్నికైన శుభసూచకమని రాష్ట్రస్థాయి బంగారు నందులను సాధిస్తామని ఆనంద నిలయం దర్శకులు వివి రమణారెడ్డి అన్నారు. హనుమాన్ కళా సమితి ఏర్పాటు చేసిన అభినందన సభ రంగస్థల కళాకారులకు చేయూతనిస్తుందని పౌరాణిక పద్య నాటకాలు రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా నుండి పోటీలో నిలిచి బంగారు నందులు గెలవాలని కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షులు సయ్యద్ రోషన్ అలీ ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ టివి రెడ్డి ఎం మనోహర్ బాబు రంగస్థల సమాజాలు తమ అభినందనలు తెలియజేశారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు శ్రీ హనుమాన్ కళా సమితి కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు పి హనుమంతరావు చౌదరి బై లుప్పల షఫీయుల్లా వివి రమణ చారి రాజశేఖర్ ఎం.ఆర్ రాధిక చిన్ని కృష్ణ డి పార్వతయ్య శ్రీనివాసులు కేశవులు కురువ నాగేష్ కళా ప్రియ తిరుపాలు మనోహర్ బాబు కిరణ్ శ్రీనివాసులు రెడ్డి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు ఆనంద నిలయం పద్యనాటకానికి జిల్లా రంగస్థల అభినందనలు తెలియజేశారు.

About Author