ఆ నియోజకవర్గానికి మాత్రమే ఆనందయ్య మందు..!
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆనందయ్య మందు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప.. ఎలాంటి ఆర్థిక సహకారము అందలేదని కృష్ణపట్నం ఆనందయ్య వ్యాఖ్యానించారు. కరెంటు సరఫరా, ఔషధ తయారీకి అవసరమైన యంత్ర సామాగ్రీ సమకూరలేదని తెలిపారు. కేవలం సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు మాత్రమే ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.