ఆనందయ్య మందును అనుమతించాలి
1 min read– రిటైర్డు డైట్ కాలేజి లెక్చరర్ ఎం.బాలన్న
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కరోన వైరస్ నియంత్రణ కోసం కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందుకు శాస్ర్తీయత లేదనే సాకుతో తయారీని, పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడం సబబు కాదని ఎన్.టీ.ఏ. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు , రిటైర్డు డైట్ కాలేజి లెక్చరర్ ఎం. బాలన్న , కర్నూలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి. ధనుంజయ రెడ్డి, ఎ. హరినాథ్, రాష్ట్ర కార్యదర్శి ఎం. రామకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్చే విచారణ కమిటీ నివేదిక సమర్పించారని, ప్రముఖ ఆయుష్ కమిటీ ఆధ్వర్యంలో కూడా సమగ్ర విచారణ జరిపించడం జరిగిందని, ఆనందయ్య మందు తయారీలో ఎలాంటి హానికరమైన మూలికలు లేవని విచారణ కమిటీ స్పష్టం చేసిందన్నారు. ఐసీఎంఆర్ రిపోర్టుపై ఎదురు చూడటం జరుగుతోందన్నారు. ప్రభుత్వమే నేరుగా కరోనా సోకిన వ్యక్తిపై ఆనందయ్య మందు వేసి.. రెండు రోజుల తరువాత కరోన పరీక్షలు చేస్తే వాస్తవాలు వెల్లడి అవుతాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు సక్సెస్ అయితే.. దేశంలో కరోన బాధితులు ఉండరని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.