అనంత అతలాకుతలం !
1 min read
పల్లెవెలుగువెబ్: అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జలమయమైంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు బ్రిడ్జిలు తెగిపోయినట్టు సమాచారం. రుద్రంపేట, విశ్వశాంతినగర్, చంద్రబాబు కొట్టాల గౌరవ్ రెసిడెన్సీ కాలనీలు నీటమునిగాయి. శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆలమూరు చెరువు గట్టు తెగిపోవడంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.