NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనంత‌పురం.. టీడీపీ నేత‌ల గృహ‌నిర్బంధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రైతు సమస్యలపై చలో కలెక్టరేట్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చలో కలెక్టరేట్‌కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు రైతులు హాజరయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున చలో కలెక్టరేట్‌కు వెళ్ళకూడదంటూ టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. కాగా… పోలీసుల ముందస్తు అరెస్ట్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

                                                     

About Author